Neeraj Chopra: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా, 88.77 మీటర్లు విసిరి గత రికార్డును అధిగమించిన భారత స్టార్

Neeraj Chopra (Photo-ANI)

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో ఒలింపియన్‌, జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా పంజా విసిరాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న మెగా ఈవెంట్‌లో ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.77 మీటర్లు విసిరిన నీరజ్‌ చోప్రా.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు.

నీరజ్‌తో పాటు మరో భారత జావెలిన్‌ స్టార్‌ డీపీ మను కూడా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌ రేసులో నిలిచాడు. తొలుత 78.10 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరిన అతడు.. 81.31 మీ.తో ఫినిష్‌ చేశాడు. తద్వారా గ్రూప్‌- ఏ నుంచి మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో దోహా డైమండ్‌ లీగ్‌లో భాగంగా నీరజ్‌ 88.07 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరాడు. తాజాగా బుడాపెస్ట్‌ ఫీట్‌తో తన గత రికార్డును అధిగమించాడు. కాగా తన కెరీర్‌లో అత్యుత్తమంగా నీరజ్‌ చోప్రా.. 89.94 మీటర్లు జావెలిన్‌ విసిరాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)