The Great Khali Joins BJP: కాషాయపు కండువా కప్పుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ గ్రేట్ ఖలీ, ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటన
డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా రాజకీయ అరంగేట్రం చేశాడు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నాడు. ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు.
డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా రాజకీయ అరంగేట్రం చేశాడు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నాడు. ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు. త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఖలీ బీజేపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా మారవచ్చని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. 7 అడుగులకు పైగా పొడవు, భారీ శరీరం కలిగిన ఖలీ, బాలీవుడ్‌తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు. అలాగే హిందీ రియాల్టీ షో బిగ్ బాష్ సీజన్ 4లో రన్నరప్‌గా నిలిచాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరఫున ఎన్నికల ప్రచారం చేసిన ఖలీ, అదే పార్టీలో చేరతాడని అంతా ఊహించారు. అయితే, ఈ అజానుబాహుడు అందరికీ షాకిస్తూ.. ఇవాళ కమల తీర్ధం పుచ్చుకున్నాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)