Andhra Cricket Controversy: రాజకీయ రంగు పులుముకున్న హనుమ విహారి-ఆంధ్రా క్రికెట్ వివాదం, అతనికి అండగా ఉంటామని తెలిపిన చంద్రబాబు, వైఎస్ షర్మిల

వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు.హనుమ విహారిని వేధించారని అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు

Hanuma Vihari (Photo Credit: Twitter/@talksports45)

వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు.హనుమ విహారిని వేధించారని అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ప్రోత్సహించరని అన్నారు.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ.. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా.. అన్నింటిలో నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ వాళ్లు, ఇప్పుడు క్రీడలపైనా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గౌరవాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన ఈ నేతలు.. ఇంకా ఎంత దిగజారిపోతారో ఊహించలేమన్నారు.ఇది ఆంధ్రా క్రికెట్ అసోసియేషనా.. అధ్వానపు క్రికెట్ అసోసియేషనా? ఈ విషయంపై వెంటనే విచారణ జరగాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.  ఆంధ్రా క్రికెట్ వివాదంలో దూరిన రవిచంద్రన్ అశ్విన్, కుట్టి కథలకు మీరు రెడీనా అంటూ ట్వీట్, నేను రెడీ అంటూ బదులిచ్చిన హనుమ విహారీ

Here's Babu Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement