Andhra Pradesh Assembly Elections 2024: రాజానగరంలో జనసేనకు షాక్, వైసీపీలో చేరిన రాయపురెడ్డి ప్రసాద్, కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
గత సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందిన రాయపురెడ్డి ప్రసాద్ (చిన్న) వైఎస్సార్‌సీపీలో చేరారు
గత సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందిన రాయపురెడ్డి ప్రసాద్ (చిన్న) వైఎస్సార్‌సీపీలో చేరారు.బుధవారం జగ్గంపేట మండలం ఇర్రిపాక వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ద్వారా కలుసుకున్నారు. పార్టీ లో చేరేందుకు ఆసక్తి చూపడంతో ఆయనను సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువ నాయకుడు జక్కంపూడి గణేష్ పాల్గొన్నారు.
రాయపురెడ్డి చిన్న రాకతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు. రాయపురెడ్డి చిన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగనన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితుడనై వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. వచ్చే ఎన్నికల్లో జక్కంపూడి రాజా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. తాను జక్కంపూడి కుటుంబంలో ఒక సభ్యుడినేనని అనివార్య కారణాలతో బయటకు వెళ్లానన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)