Vinod Reddy Resigns Janasena: నెల్లూరులో జనసేనకు భారీ షాక్, పార్టీకి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి రాజీనామా, సీటు లేదని తేల్చి చెప్పడంతో కీలక నిర్ణయం

జనసేన కోసం నగరంలో ఎంతో కృషి చేశానని, నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడు నెలల క్రితం ప్రకటించిందని పేర్కొన్నారు.

Nellore Janasena Key Leader Kethamreddy Vinod Reddy Resigns From Party

జనసేనకు తాను రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన కోసం నగరంలో ఎంతో కృషి చేశానని, నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడు నెలల క్రితం ప్రకటించిందని పేర్కొన్నారు. అప్పటికి జనసేనతో టీడీపీకి పొత్తు లేదని, అయినా తనను వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించొద్దని.. నారాయణతో మనం కలిసి పని చేయాలని పార్టీ పెద్దలు పలువురు తనకు తెలిపారన్నారు.

2016లో సేవ్‌ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే నారాయణ అక్రమాలపైనని, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఆయన అక్రమాలపై గళం వినిపించానని తెలిపారు. పార్టీలో తనకంటూ గౌరవం లేకుండా.. తాను భరోసా కల్పించిన ప్రజలకు నమ్మకం పోగొట్టేలా పార్టీలోని పలువురు వ్యవహరించారని.. ఇది సహించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.

Nellore Janasena Key Leader Kethamreddy Vinod Reddy Resigns From Party
Nellore Janasena Key Leader Kethamreddy Vinod Reddy Resigns From Party

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు