Memantha Siddham Bus Yatra: గాయం తర్వాత సీఎం జగన్ లేటెస్ట్ వీడియో ఇదిగో, గన్నవరంలో పార్టీ నేతలతో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి, నేడు గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభ
యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరారు. బస్సు యాత్రలో భాగంగా గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు.తాజాగా గన్నవరంలో పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో విచారణకు సిట్ ఏర్పాటు...ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన విజయవాడ సీపీ
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)