Gummanur Jayaram Resigns YSRCP: వైసీపీకి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రాజీనామా, టీడీపీ అభ్యర్థిగా గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని వెల్లడి
విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
వైసీపీ (YCP)కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) రాజీనామా చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగుచెందానని గుమ్మనూరు విమర్శించారు.
12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని.. మంత్రి పదవి చేశానన్నారు. ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానన్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ అడిగారు. నాకు అది ఇష్టం లేదు. ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని కోరుకున్నానని.. ఎంపీ పదవి వద్దన్నానని తెలిపారు.తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారు’’ అని ఆరోపించారు. పులివెందులలో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన కీలక నేత సతీష్‌రెడ్డి, వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని వెల్లడి
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)