Gummanur Jayaram Joins TDP: టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు, మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేసిన వైసీపీ

మంగళగిరి జయహో బీసీ సభలో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.

Aluru MLA gummanur-jayaram-joins-tdp in Jayaho BC Meeting (photo-Video Grab)

మంగళగిరి జయహో బీసీ సభలో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.  వైసీపీకి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రాజీనామా, టీడీపీ అభ్యర్థిగా గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని వెల్లడి

ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ... టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు వైసీపీకి, మంత్రి పదవికి జయరాం రాజీనామా చేసిన సంగతి విదితమే.పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బర్తరఫ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now