Arani Srinivasulu Joins Janasena: జనసేనలో చేరిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తనకు టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆవేదన
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆరణి శ్రీనివాసులుకు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు.
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆరణి శ్రీనివాసులుకు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. బలిజ సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని తానేనని వెల్లడించారు.
అలాంటిది తనకు కూడా టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు నచ్చే జనసేన పార్టీలోకి వచ్చానని స్పష్టం చేశారు. చిత్తూరులో జనసేన అభిమానుల ఇళ్లను కూల్చివేస్తున్నారని, తిరుపతిలో పేదల ఇళ్లను వైసీపీ నేతలు తొలగించారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి ఎంట్రీకి లైన్ క్లియర్, ఆనయ నివాసంలో భేటీ అయిన వైఎస్సార్‌సీపీ నేతలు, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)