Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, ఒంగోలులో ఘోరంగా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలినేని

ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి ఘోరంగా కొట్టుకున్నారు. అక్కడికి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ చేరుకోగా.. మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరుపార్టీల కార్య కర్తలను చెదరగొట్టి, గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Clash between TDP YCP workers in Ongole

ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి ఘోరంగా కొట్టుకున్నారు. అక్కడికి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ చేరుకోగా.. మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరుపార్టీల కార్య కర్తలను చెదరగొట్టి, గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై నారా లోకేష్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ పాలన సూపర్ అంటున్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమం అంటూ కితాబు, వీడియో ఇదిగో..

దీనిపై బాలినేని స్పందిస్తూ.. మీ టీడీపీ వాళ్ళది మొదట్నుంచీ తప్పుడు ప్రచారం, తప్పుడు బతుకే కదా నారా లోకేష్ చేయాల్సిన దారుణాలన్నీ చేసేసి అవతలివాళ్ళమీద నెట్టేయడం మీకు జన్మతః వచ్చిన కుత్సిత బుద్ధి. వాస్తవానికి ఒంగోలు జిల్లాలో ప్రచారానికి వెళ్లిన బాలినేని శ్రీనివాస రెడ్డి గారి కోడలు కావ్య గారిని బూతులు తిడుతూ దాడి చేసింది మీ టీడీపీ కార్యకర్తలు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేస్తున్నా తట్టుకోలేకపోతున్నారంటే మీకు ఓటమి ముందే అర్థమైందన్నమాట. ఈ దాడులే మిమ్మల్ని ఓటమివైపు నడిపిస్తాయి... సిద్ధంగా ఉండండి అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement