Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, గన్నవరంలో చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్న వల్లభనేని వంశీ, యార్లగడ్డ వర్గీయులు

ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

fight-between-vallabhaneni-vamsi-and-yarlagadda-venkat-rao-followers

ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గీయులు ఒకరిపై మరొకరు చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరూ వారివారి కార్లలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు.  చీరాలలో రక్తమొచ్చేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు, వీడియో ఇదిగో..

మరోవైపు గుంటూరు జిల్లా పెదపరిమిలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత సందీప్ అనుచరులు, టీడీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఆ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. జిల్లా అదనపు ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

AP Cabinet Decisions: వచ్చే విద్యాసంవత్సరం నుండి తల్లికి వందనం..రాజధాని అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, పీఎం కిసాన్,అన్నదాత సుఖీభవ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Kareena Kapoor Khan Releases Statement: చాలా కష్ట సమయంలో ఉన్నాం..దయచేసి అలా చేయొద్దు! సైఫ్‌ అలీఖాన్‌పై హత్యాయత్నం గురించి తొలిసారి స్పందించిన కరీనా కపూర్‌

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Share Now