TDP-Janasena's First List: రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి, టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండలి బుద్ధ ప్రసాద్
టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు
టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి.
డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు.అవనిగడ్డ నుంచి టీడీపీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న బుద్ధ ప్రసాద్ ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.పొత్తుల సీట్ల ప్రకటనలో అవనిగడ్డ సీటును చంద్రబాబు, పవన్ పెండింగ్‌లో పెట్టారు.
Here's Post
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)