Andhra Pradesh Elections 2024: ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలకు రూ.5000 ఇస్తాం, సంచలన ప్రకటన చేసిన మల్లిఖార్జున ఖర్గే

ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.5,000 ఇస్తామని ఆయన అన్నారు.

If Congress wins in AP, we will give Rs.5000 to every family every month says Mallikharjuna Kharge

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని పోటీ వైసీపీ టీడీపీ కూటమి మధ్యనే సాగనుండగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కు ఒకప్పుడు కంచుకోట అయిన ఏపీలో రాష్ట్ర విభజనతో నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయిన సంగతి విదితమే. అయితే ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరాల జల్లులు కురిపిస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ గెలిస్తే ప్రతి నెలా, ప్రతి కుటుంబానికి రూ.5000 ఇస్తామని పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.5,000 ఇస్తామని ఆయన అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)