MP Balashowry joins Janasena: జనసేన తీర్థం పుచ్చుకున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తున్నట్లుగా వార్తలు

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచుకున్నారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు

MP Balashauri joins Janasena (Photo-XVallabhaneni Balashowr)

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచుకున్నారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా మరోసారి మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.గత ఎన్నికల్లో వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వమని జగన్ సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు బాలశౌరి జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

Here's MP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement