Ambati Rambabu Slams Pawan Kalyan: నీకు, చంద్రబాబుకి మొగుడు జగన్, నీ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్, జనసేనాధినేతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు
పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్, నీకు, చంద్రబాబునాయుడుకి మొగుడు జగన్ మోహన్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్, నీకు, చంద్రబాబునాయుడుకి మొగుడు జగన్ మోహన్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను పాతాళానికి తొక్కేస్తానని పవన్ అన్నారని... అది జరగాలంటే పవన్ ను పుట్టించిన వాళ్లు రావాలని అన్నారు. పవన్ గొప్పా? లేక జగన్ గొప్పా? అనేది జనసైనికులే చెపుతారని అన్నారు. తాడేపల్లిగూడెం సభలో ఏం సందేశం ఇచ్చారని మండిపడ్డారు.
పవన్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని... ఆయన మంచి నటుడని అంబటి అన్నారు. అయితే ఆయన రాజకీయాలకు పనికిరారని చెప్పారు. పిచ్చిపిచ్చి సినిమా డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. పవన్ చీప్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని... పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు బాధ కలిగిందని పవన్ అన్నారని... మరి వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు బాధ కలగలేదా? అని ప్రశ్నించారు. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా? అని అడిగారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)