Kolusu Parthasarathy Joins TDP: టీడీపీలో చేరిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.

Kolusu Parthasarathy Joins TDP (Photo-Video Grab)

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా జిల్లా పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) కొలుసు పార్థసారథి(Parthasarathy) టీడీపీ(TDP) కండువా కప్పుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు అధ్యక్షుడు చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ విధానాలు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(CM Jagan) ఒంటెద్దు పోకడలకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి పార్టీని వీడానని వెల్లడించారు.

చంద్రబాబు విజన్‌ భావి తరాలకు ఎంతో అవసరమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యం లేదని ఆరోపించారు. బలహీన వర్గాలకు వైసీపీలో అన్నీ అవమానాలేనని ఆరోపించారు. నూజివీడులో అందరినీ కలుపుకొని పోతూ టీడీపీ జెండా ఎగురవేస్తానని అన్నారు. 2004,2009,2019లో ఎమ్మెల్యేగా పెనుమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు.టీడీపీ-జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పార్థసారథికి చోటు దక్కింది. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

Here's Video