Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ షర్మిల

పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Nandikotkur YCP MLA Arthur Joined Congress Party

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి నందికొట్కూరులో షాక్ తగిలింది నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే గతంలో మాట్లాడుతూ..ఐప్యాక్‌ సర్వేలో రాష్ట్రంలో తనకే ఎక్కువ శాతం అనుకూలంగా వచ్చిందని.. కానీ ఎందుకో తనకు టికెట్‌ దక్కలేదన్నారు. నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఇంఛార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందన్నారు.నందికొట్కూరు టికెట్‌ ఇస్తాం కానీ.. పాలన బాధ్యతలు వేరేవారికి అప్పగిస్తామని ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, ఐప్యాక్‌ రాయలసీమ ఇంఛార్జ్ దివాకర్‌రెడ్డి అన్నారన్నారు. ఆ వ్యాఖ్యలు విని తాను షాకయ్యానన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, సీఎం జగన్‌ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడి

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)