Andhra Pradesh Elections 2024: జనసేన ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం రూ. 10 కోట్లు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

జనసేనాని పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ జనసేన కోసం తన సొంత డబ్బు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు అందజేశారు.

Pawan Kalyan donated Rs.10 crores for Janasena party Watch Video

జనసేనాని పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ జనసేన కోసం తన సొంత డబ్బు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, నాడు స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని ప్రస్తావించారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బు వెచ్చించిన తీరు గొప్పది అని కొనియాడారు. ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడం కోసం జనసేన పార్టీ సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లు అందజేస్తున్నాను. ఈ నగదు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అని తెలిపారు.  వీడియో ఇదిగో, చంద్రబాబుపై నరసాపురం ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు, నమ్ముకున్నోడికి సీటు ఇప్పించలేదు. మిమ్మల్ని ఎలా నమ్ముతారంటూ..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now