Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్, జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కీలక నేత మాకినీడి శేషు కుమారి

జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీలో చేరారు.

Andhra Pradesh Elections 2024: Pithapuram Janasena Woman Leader Makineedi Seshu Kumari Joins in YSRCP

కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషకుమారి పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి. మిథున్‌రెడ్డి, పిఠాపురం వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు. నేను జనసేనలోకి రావడం కాదు నువ్వే వైసీపీలోకి రా పవన్, జనసేనాని వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)