Andhra Pradesh Elections 2024: నేను జనసేనలోకి రావడం కాదు నువ్వే వైసీపీలోకి రా పవన్, జనసేనాని వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత

2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.

Vanga Geetha vs Pawan Kalyan (Photo-File Image)

పిఠాపురంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్‌సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు వంగా గీత కౌంటర్ విసిరారు.

బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె..నేను కూడా పవన్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?’’ అని అన్నారు.2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. పిఠాపురం జనసేన నియోజకవర్గ నేత మానినీడు శేషు కుమారి నేడు వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారని సమాచారం. సీఎం జగన్‌ సమక్షంలోనే ఆమె వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.  నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలంటూ పురుగుమందు తాగిన టీడీపీ నేత, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)