Satish Reddy Joins YSRCP: పులివెందులలో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన కీలక నేత సతీష్‌రెడ్డి, వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని వెల్లడి
పార్టీ కీలక నేత సతీష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు.
పులివెందులలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత సతీష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు. ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది. సీఎం జగన్ ఏం చెబితే అదే చేస్తా’’ అని సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు.
నాతో వైఎస్సార్‌సీపీ నేతలు టచ్‌లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు. ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు. చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది. ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది. సీనియర్లకు గౌరవం లేదు. టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారిందన్నారు. వైసీపీలో చేరిన హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్, ఆరేళ్లలో అరగంట కూడా నాతో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మండిపాటు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)