Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, వీడియో ఇదిగో..

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్‌ బాబు, ఇమ్రాన్‌ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Vangaveeti-Narendra-Joined-Ysrcp.jpg1

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్‌ బాబు, ఇమ్రాన్‌ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.పార్టీలో చేరిన అనంతరం వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమంటూ మండిపడ్డారు. కూటమి ఏర్పడింది ప్రజలు కోసం కాదు.. వారి స్వార్థం కోసం. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఏనాడూ ఆలోచించలేదు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్‌ వెళ్లడం ఏంటి?. పవన్‌ వెంట కాపులెవరూ ఉండరు’’ అంటూ వంగవీటి నరేంద్ర తేల్చిచెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్, జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కీలక నేత మాకినీడి శేషు కుమారి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)