Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, చంద్రబాబుపై నరసాపురం ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు, నమ్ముకున్నోడికి సీటు ఇప్పించలేదు. మిమ్మల్ని ఎలా నమ్ముతారంటూ..

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు సంబంధించిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు.. తన సీటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీటు ఇవ్వాలి.. విజయనగరం వదిలేయండి. టీడీపీ నాకు సీటు ఇవ్వాలి

Raghu Ramakrishna Raju (Photo-ANI)

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు సంబంధించిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు.. తన సీటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీటు ఇవ్వాలి.. విజయనగరం వదిలేయండి. టీడీపీ నాకు సీటు ఇవ్వాలి. ఎందుకివ్వరు? వీళ్లు అడిగారు. అవతలి వాళ్లు మోసం చేశారు. మోసం చేస్తే పోరాడాలి.ఆడిన మాట తప్పి నాకు సీటు ఎగ్గొట్టారు. నాకు సీటు ఇవ్వలేనివారు కేంద్రంతో పోరాడి పోలవరం కడతారంటే నమ్ముతారా? రాష్ట్రానికి ఏదైనా తీసుకువస్తారంటే నమ్ముతారా? ముసుగు తీసేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థిగా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడి

నమ్ముకున్నవాడికి, ప్రజల కోసం పోరాడిన వాడికి, చావు దాకా వెళ్లి వెనక్కి వచ్చినవాడికి సీటే తెచ్చుకోలేకపోయావ్ కదా అని.. ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కానీ అలాంటి పరిస్థితి రాదు. బీజేపీ అధిష్టానం పొరబాటును తెలుసుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా నరసాపురం ఎంపీ టికెట్‌ను భూపతిరాజు శ్రీనివాసవర్మకు బీజేపీ కేటాయించిన సంగతి విదితమే. ఇక రఘురామను విజయనగరం ఎంపీ సీటు నుంచి కాకుండా పశ్చిమగోదావరి జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ బరిలోకి దింపుతుందని ప్రచారం జరుగుతోంది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement