IAS Imtiaz Joins YSRCP: వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్, కర్నూలు అసెంబ్లీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు
సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్ల అభ్యర్థులతో 8వ జాబితా విడుదల
కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యనేతలు, ఎమ్మెల్యే, జిల్లా నేతలతో ఆయన అభ్యర్థిత్వంపై జగన్ చర్చిస్తున్నారు. దాదాపు అభ్యర్థిగా ఇంతియాజ్ ఫిక్స్ అయినట్టు సమాచారం. దీంతో ఇంతియాజ్‌కు జగన్ నుంచి ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)