Andhra Pradesh Elections 2024: సీఎం జగన్ పై అభ్యంతరకర పోస్టులు, చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన ఈసీ, 24 గంటల్లోగా పోస్టులు తొలగించాలని ఆదేశాలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు

State Election Commission notice to chandrababu over election code violation

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈవో ముఖేష్‌ కుమార్‌మీనా స్పష్టం చేశారు. ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. 2023కు సంబంధించి రెండు డీఏలు విడుదల.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)