Andhra Pradesh Elections 2024: నన్ను ప్రధాని మోదీ ఎంపీగా పోటీ చేయమంటే కాకినాడకు వెళతా, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఖరారు
ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ సమావేశమయ్యారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. నన్ను ఎంపీగా పోటీ చేయమని ప్రధాని మోదీ, అమిత్ షా చెబితే ఆలోచిస్తా. అప్పుడు పిఠాపురం నుంచి ఉదయ్, కాకినాడ ఎంపీగా నేను పోటీ చేస్తాం అని పవన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ షర్మిల
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)