Andhra Pradesh Elections 2024: తిరుపతి టికెట్ జనసేనకు ఇవ్వడంతో ఏడ్చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని సూటి ప్రశ్న

తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్‌ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టికెట్‌ దక్కలేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమని అన్నారు.

Sugunamma TDP (photo-Video Grab)

తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్‌ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టికెట్‌ దక్కలేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. వీడియో ఇదిగో, అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తామని తెలిపిన చంద్రబాబు

తిరుపతి సీటును జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎవరికో మద్దతు పలకమంటే తాను అంగీకరించినా.. పార్టీ కేడర్‌ అంగీకరించదని పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదన్న సుగుణమ్మ.. తిరుపతికి తమ కుటుంబం చేసిన పనులను గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement