Andhra Pradesh Elections 2024: భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ తుది జాబితా ఇదిగో..

పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను టీడీపీ ప్రకటించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది.

TDP Logo

పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను టీడీపీ ప్రకటించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా.. ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చింది. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, విజయనగరం లోక్‌సభకు కలిశెట్టి అప్పలనాయుడును ఆ పార్టీ బరిలో నిలిపింది.

అసెంబ్లీ అభ్యర్థులు

చీపురుపల్లి- కళా వెంకట్రావు

భీమిలి- గంటా శ్రీనివాసరావు

పాడేరు- కె. వెంకటరమేశ్‌ నాయుడు

దర్శి- గొట్టిపాటి లక్ష్మి

రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం

ఆలూరు- వీరభద్ర గౌడ్‌

గుంతకల్లు- గుమ్మనూరు జయరామ్

అనంతపురం అర్బన్‌- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌

కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌

పార్లమెంట్ అభ్యర్థులు

విజయనగరం- కలిశెట్టి అప్పలనాయుడు

ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి

అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ

కడప- భూపేష్‌రెడ్డి

Here's list

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement