Andhra Pradesh Elections 2024: సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసిన టీడీపీ, దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో రూపకల్సన, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు
సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసి దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. కూటమి ఆధ్వర్యంలో త్వరలో కొత్త మేనిఫెస్టో ఉంటుందని ప్రజలు సలహాలు ఇవ్వాలని వర్ల రామయ్య తెలిపారు
ఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసి దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. కూటమి ఆధ్వర్యంలో త్వరలో కొత్త మేనిఫెస్టో ఉంటుందని ప్రజలు సలహాలు ఇవ్వాలని వర్ల రామయ్య తెలిపారు. ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో ప్రజలను కూడా భాగం చేస్తోంది. మేనిఫెస్టోలో రూపొందించే అంశాలపై సలహాలను, సూచనలను స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 8341130393 నంబర్‌కు సూచనలను టెక్ట్స్ రూపంలో గానీ, వాయిస్ మెసేజ్, పీడీఎఫ్‌గానైనా పంపొచ్చని కూటమి నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ఎన్డీయే కూటమి అజెండా అని తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)