Balineni Srinivasa Reddy: వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి జగన్‌కు కానుకగా ఇస్తాం, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిచి సీఎంకు కానుకగా అందిస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరైన సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఒంగోలులో పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
పేదల కోసం కొన్న భూములకు ఎకరాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, వాటిని రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తాను అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకుంటే పోటీ కూడా చేయనని చెప్పానని అన్నారు.. సీఎం జగన్ ఇచ్చిన భరోసా వల్లే ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాను అని ఆయన పేర్కొన్నారు.
సీఎం వల్లే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సాకారమైందని ప్రశంసించారు. గతంలో పేదలకు ఇళ్ళ స్థలాల కోసం యర్రజర్లలో చూసిన ప్రభుత్వ భూమికి టీడీపీ అడ్డంకులు సృష్టించిందని ఫైర్ అయ్యారు. అందుకే అగ్రహారం, వెంగముక్కలపాలెంలలో భూములు చూశామని, ఇక్కడ కూడా టీడీపీ కోర్టు కేసులు వేయించి ఇబ్బందులు పెట్టాలని చూసింది అని ఆరోపించారు. వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ, ఒంగోలు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మండిపడిన సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిచి సీఎంకు కానుకగా అందిస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరైన సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఒంగోలులో పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)