YSRCP 9th List: నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి, తొమ్మిదవ జాబితాను విడుదల చేసిన జగన్ సర్కారు, మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్య నియామకం
మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది
అసెంబ్లీ ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ తాజాగా తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది. కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్(రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్ల అభ్యర్థులతో 8వ జాబితా విడుదల
Here's List
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)