Buragadda Vedavyas: చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారు, పెడనలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి నేనేంటో చూపిస్తానంటూ బూరగడ్డ వేదవ్యాస్ సవాల్
చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ వేదవ్యాస్ మండిపడ్డారు. నాకు టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు నాకే ఉంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. గెలిచే సత్తా నాకుంది’’ అని వేదవ్యాస్ పేర్కొన్నారు.ఇక పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై..మాకు అన్యాయం జరిగిన చోట మేం ఉండలేం అంటూ కృత్తివెన్ను,గూడూరు,పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
టీడీపీ-జనసేన విడుదల చేసిన తొలి జాబితాతో అసంతృప్త సెగలు రేగుతున్నాయి. తాజాగా పెడన నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పెడన టిక్కెట్‌ను కాగిత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు కేటాయించడంతో సీటు మీద ఆశలు పెట్టుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో కార్యకర్తల సమావేశంలో అస్వస్థతకు గురవ్వగా, కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు.
చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ వేదవ్యాస్ మండిపడ్డారు. నాకు టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు నాకే ఉంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. గెలిచే సత్తా నాకుంది’’ అని వేదవ్యాస్ పేర్కొన్నారు.ఇక పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై..మాకు అన్యాయం జరిగిన చోట మేం ఉండలేం అంటూ కృత్తివెన్ను,గూడూరు,పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)