Dadi Veerabhadrarao Resigned YCP: అనకాపల్లిలో వైసీపీకి షాక్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా, త్వరలో రాజకీయ భవిష్యత్ ప్రకటన
వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి దాడి పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy)రాజీనామా లేఖను పంపించారు.
రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని.. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెబుతామని దాడి వీరభద్రరావు ప్రకటించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు.. తెలుగుదేశం తరపున అనకాపల్లి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)