KA Paul Slams Nara Lokesh: మరోసారి రెడ్ బుక్ అంటూ ఎవరిపైనైనా కేసులు నమోదు చేస్తే నీ అంతు చూస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని నారా లోకేష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్, వీడియో ఇదిగో..

ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్.. నారా లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఓడించిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అని.. రాజశేఖర్ రెడ్డి అంటే చంద్రబాబు భయంతో ఉండేవారని గుర్తు చేశారు. అసలు రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రమాదం ఏర్పడకుండా చంద్రబాబును తానే కాపాడానని చెప్పుకొచ్చారు

KA Paul (Credits: X)

ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్.. నారా లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఓడించిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అని.. రాజశేఖర్ రెడ్డి అంటే చంద్రబాబు భయంతో ఉండేవారని గుర్తు చేశారు. అసలు రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రమాదం ఏర్పడకుండా చంద్రబాబును తానే కాపాడానని చెప్పుకొచ్చారు. తాను మధ్యవర్తిగా ఉండి రాజశేఖర్ రెడ్డిని ఒప్పించానని నాటి సంగతులను గుర్తు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్తారని నాడే చెప్పానని… నేను చెప్పిన మాదిరిగానే చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12కు వాయిదా వేసిన వైసీపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కీలక నిర్ణయం

జగన్ ప్రభుత్వ హయాంలో తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అన్నారు. ఇప్పుడు రెడ్ బుక్ పేరు చెప్పి రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్నారని లోకేష్ పై మండిపడ్డారు. నువ్వెంత నీ బతుకెంత అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. మరోసారి విపక్ష నేతలపై కేసులు నమోదు చేసినా… అరెస్టులు జరిగినా ఊరుకునేది లేదు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.మరోసారి రెడ్ బుక్ అంటూ ఎవరిపైనైనా కేసులు నమోదు చేస్తే తన విశ్వరూపం చూపిస్తానని హెచ్చరించారు. ఒరేయ్ లోకేష్.. తమాషాగా ఉందా.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు.. అంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యారు.

KA Paul Slams Nara Lokesh Redbook

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now