ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ వెంటనే విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ
‘రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిశాక మార్చి 12న ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించాం’ అని వైఎస్సార్‌సీపీ వెల్లడించింది.
YSRCP 'Fees Poru' protest Postponed to March 12
ఫీజు పోరు మార్చి 12కు వాయిదా... #YSRCPFORSTUDENTS https://t.co/VZdRh6P5af pic.twitter.com/9iUtvL0we4
— YSR2JAGAN_YSRCP ™ (@HARSHAR_YSRCP07) February 4, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)