New Delhi, Feb 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెబుతూ కిసాన్ క్రెడిట్ కార్డు (Kisan Credit Card) రుణ పరిమితిని పెంచింది. ప్రస్తుతం రూ.3లక్షలుగా ఉన్న ఈ పరిమితిని.. రూ.5లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని 1998లో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్డుల ద్వారా వ్యవసాయం సహా మత్స్య, పశుసంవర్థక రంగాల్లో స్వల్పకాలిక రుణాలను బ్యాంకుల నుంచి పొందవచ్చు.
అలాగే వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలైప ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చు, పంట కోత ఖర్చులు వంటి అవసరాల కోసం ఈ కిసాన్ కార్డు ద్వారా (What is Kisan Credit Card,) లోన్ తీసుకోవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులతో బీమా సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా పొందవచ్చు.
ఇంతకుముందు రూ.1.60 లక్షలకు పైబడిన రుణాలకు గ్యారంటీ అవసరం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గ్యారెంటీ లేని రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచింది. అంటే ఇప్పుడు రూ. 2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు పొందవచ్చు.ఈ పథకం కింద, వ్యవసాయ కార్యకలాపాలకు కేవలం 4 శాతం సరసమైన వడ్డీ రేటుతో రుణాలు అందించబడతాయి. దరఖాస్తుదారుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి లేదు. ఈ పథకం కింద గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు, దాని తాజాగా కేంద్రం రూ. 5 లక్షలకు పెంచింది. గరిష్ట రుణ కాల వ్యవధి 5 సంవత్సరాలు. కిసాన్ క్రెడిట్ కార్డ్ చెల్లుబాటు కూడా ఐదేళ్లు.
ఆఫ్‌లైన్‌లో కిసాన్ క్రెడిట్ కార్డు పొందడం ఎలా ?
1. రైతులు తమ అకౌంట్ ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకును సంప్రదించాలి. అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు ఫారమ్ తీసుకుని.. అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి.
2. ఐడీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి చూపించాలి.
3. పాస్‌పోర్టు సైజ్ ఫొటో, వ్యవసాయ భూమి పత్రాలను ఆ దరఖాస్తు ఫారమ్‌కు జత చేసి బ్యాంకులో సమర్పించాలి.
4. మీరు సమర్పించిన వివరాలను బ్యాంకులు చెక్ చేసి ఐదేళ్ల కాలపరిమితితో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డును మీకు మంజూరు చేస్తుంది.
ఆన్‌లైన్‌లో కిసాన్ క్రెడిట్ కార్డు పొందడం ఎలా ?
1. ముందుగా సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
2. అందులో రుణాలకు సంబంధించిన ఆప్షన్ ఎంచుకుని.. అందులో కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
3. అక్కడ అడిగిన వివరాలను మీరు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.
4. దరఖాస్తు పూర్తయిన తర్వాత ఒక రిఫరెన్స్ నంబర్‌ను పొందుతారు.
5. ఆ నంబర్ ఆధారంగా కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
KCC లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి
1: మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2: ఎంపికల జాబితా నుండి, "కిసాన్ క్రెడిట్ కార్డ్" ఎంపికను ఎంచుకోండి.
3: "వర్తించు"పై క్లిక్ చేయండి, ఇది మిమ్మల్ని అప్లికేషన్ పేజీకి మళ్లిస్తుంది.
4: అవసరమైన వివరాలతో ఫారమ్‌ను పూరించండి, "సమర్పించు" అనే దానిపై క్లిక్ చేయండి.
5: మీరు అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ను అందుకుంటారు. మీరు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, బ్యాంక్ 3 నుండి 4 పని రోజులలోపు మిమ్మల్ని సంప్రదిస్తుంది.
అవసరమైన పత్రాలు
దరఖాస్తు ఫారమ్
రెండు పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలు
ID రుజువు: డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ ID లేదా పాస్‌పోర్ట్ వంటివి.
చిరునామా రుజువు: డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డ్ వంటివి.
భూమి యాజమాన్య రుజువు: రెవెన్యూ అధికారులు ధృవీకరించారు.
పంట వివరాలు: సాగు చేస్తున్న పంటల సమాచారం.
2 లక్షలకు మించిన రుణాలకు భద్రతా పత్రాలు అవసరం.