Roja on Tirupati Laddu Dispute: చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలడం లేదు, తిరుపతి లడ్డుపై స్పందించిన వైసీపీ నేత రోజా
మాజీ ఏపి మంత్రి ఆర్కే రోజా తిరుపతి లడ్డు వివాదంపై స్పందించారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలడం లేదు.
మాజీ ఏపి మంత్రి ఆర్కే రోజా తిరుపతి లడ్డు వివాదంపై స్పందించారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలడం లేదు.. శ్రీవారి ప్రసాదాలలో అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు. జూలై 23 న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు… అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారన్నారు.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో పీఎం మోదీ, సీజేఐలు, చంద్రబాబు సైతం ఫ్యామిలీతో రావడం జరిగింది.. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? అని మండిపడ్డారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)