Telugu and Sanskrit Academy: తెలుగు అకాడమీ ఇకపై తెలుగు, సంస్కృత అకాడమీ, పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో నలుగురి నియామకం
తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో నలుగురిని నియమించింది.
ఏపీ ప్రభుత్వం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో నలుగురిని నియమించింది. శ్రీవేంకటేశ్వర యూనిర్శిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ భాస్కర రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకుడు డాక్టర్ నేరెళ్ల రాజ్ కుమార్, గుంటూరు జేకేసీ కాలేజీ తెలుగు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.విజయశ్రీ, ఎస్ఆర్ఎస్వీ బీఈడీ కాలేజీ లెక్చరర్ కప్పగంతు రామకృష్ణను బోర్డు గవర్నర్లుగా నియమించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్శిటీ వైస్ చాన్సెలర్ మురళధర శర్మను యూజీసీ నామినీగా నియమించారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)