Andhra Pradesh Elections 2024: ఎవరికి ఎన్ని సీట్లు ? నేటితో తేలిపోనున్న పొత్తుల లెక్కలు, చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల మధ్య కీలక భేటీ
ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారు.
BJP-TDP-JanaSena Alliance Meeting: ఉండవల్లిలోని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ (BJP), జనసేన (Janasena) ముఖ్య నేతలు మధ్య కీలక భేటీ జరుగుతోంది. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ పండా తదితరులు భేటీ అయ్యారు.
జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. మరోవైపు బీజేపీకు కేటాయించే స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీడీపీ అభ్యర్థులతో ముడిపడి ఉన్న అంశాలు కావడంతో మూడు పార్టీల నేతలు దీనిపై చర్చించి ఒకట్రెండు రోజుల్లో స్పష్టతకు రానున్నారు. సీట్ల పంపకాలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సమావేశం, మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)