New IPS Officers For Telugu States: తెలుగు రాష్ట్రాలకు 9 మంది కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఆరుగురు
ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు.
తెలుగు రాష్ట్రాలకు 9 మంది కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)