Chandrababu Arrest: మంచోడు జైల్లో..పిచ్చోడు లండన్‌లో, సీఎం జగన్ బస చేసిన లండన్ హోటల్ ముందు నిరసన తెలిపిన ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. లండన్, ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ కు ఈ నిరసన సెగ తగిలింది. లండన్ లో ఆయన బస చేసిన ప్రాంతంలో ఎన్ఆర్ఐలు నిరసన ప్రదర్శన చేశారు.
అక్రమ అరెస్టును ఖండిద్దాం.. ప్రజస్వామ్యాన్ని కాపాడదాం అంటూ నినాదాలు చేస్తూ పలువురు టీడీపీ అభిమానులు ఆందోళన చేశారు. ‘మంచోడు జైల్లో.. పిచ్చోడు లండన్ లో’ ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఎన్ఆర్ఐ టీడీపీ లీడర్లు స్వాతి రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నెదర్లాండ్స్ తో పాటు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో టీడీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)