Chandrababu Health Update: అరెస్టు తర్వాత దిగజారిన చంద్రబాబు ఆరోగ్యం.. అసలేం జరిగింది?? వీడియోతో
అరెస్టు తర్వాత చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు హైబీపీ, షుగర్ ఉన్నట్టు తేలింది.
Vijayawada, Sep 9: స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో (Skill Development Scam) తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడును (Chandrababu Naidu) పోలీసులు (Police) అరెస్ట్ (Arrest) చేసిన విషయం తెలిసిందే. అయితే, అరెస్టు తర్వాత చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు హైబీపీ, షుగర్ ఉన్నట్టు తేలింది. జరిగిన పరిణామాలతో ఆయన ఆరోగ్యం దిగజారినట్టు తెలుస్తుంది. అయినా పోలీసులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా అరెస్టు పర్వాన్ని, రిమాండ్ తతంగాన్ని ముందుకు తీసుకుపోతున్నట్టు చంద్రబాబునాయుడు తరుపు న్యాయవాదులు తెలిపారు. అనార్యోగాన్ని సైతం పట్టించుకోకపోటంతో చంద్రబాబు తరుపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు. బాబుకు సంబంధం లేని కేసుతో, లేనిపోని సెక్షన్లు బనాయించి అరెస్టు చేయడాన్ని అటు తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోవటం లేదు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)