I-PAC: మంత్రుల పనితీరు, గెలుపోటములపై ఐప్యాక్ సర్వే పేరుతో కథనం ఫేక్, తప్పుడు సర్వేలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపిన I-PAC డైరెక్టర్ రిషి రాజ్ సింగ్

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, ఇలాంటి లేనిపోని, తప్పుడు సర్వేలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని I-PAC డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ తెలిపారు.

IPAC (Photo-IPAC)

ఏపీలో ప్రముఖ తెలుగు పత్రికలో మంత్రుల పనితీరు, గెలుపోటములపై ఐప్యాక్ సర్వే పేరుతో ప్రచురించిన కథనం పూర్తి సత్యదూరంగా ఉందని ఐప్యాక్ తెలియజేసింది. ఎలాంటి పరిశీలన, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం లేకుండా ఏకపక్షంగా ఈ కథనాన్ని రాశారు. నిరాధారమైన, అసమంజసమైన సమాచారాన్నే అందులో పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, ఇలాంటి లేనిపోని, తప్పుడు సర్వేలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని I-PAC డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోను గమనిస్తే ఐప్యాక్ లోగోని మార్క్ చేస్తూ మెయిల్ IDని హైడ్ చేశారని ఆ సంస్థ వివరించింది. అంతే కాకుండా అదే వీడియోలో ఐప్యాక్ డైరెక్టర్ పేరు కూడా తప్పు ప్రచురించిందని వివరించింది.  ఈ వార్తను ఖండిస్తూ వైసీపీ కూడా ట్విటర్లో ట్వీట్ చేసింది.

Here's YSRCP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

FM Nirmala Sitharaman: విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి బ్యాంకులకు రూ.14 వేల కోట్లు జమచేశాం, లోకసభలో ఎఫ్‌ఎం నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి