Padala Aruna Joins Janasena: జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణ, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అధినేత పవన్ కళ్యాణ్

పవన్‌కల్యాణ్‌ బసచేసిన హోటల్‌లో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి PawanKalyan ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. వీడియో ఇదిగో..

Former minister Padala Aruna joined Janasena party, Pawan Kalyan invited to the party by wearing a scarf

విశాఖపట్నంలో మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీలో చేరారు. పవన్‌కల్యాణ్‌ బసచేసిన హోటల్‌లో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి PawanKalyan ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. గజపతినగరం నుంచి పడాల అరుణ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1989, 1994, 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ రెండేళ్ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ ను అరుణ కలిశారు.

ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరమని చెప్పారు. ఈ కారణం వల్లే తాను జనసేనలో చేరానని అన్నారు. యువతకు మేలు చేసే పవన్ నిర్ణయాలు, ఆలోచనలు తనకు నచ్చాయని చెప్పారు. వీడియో ఇదిగో..

Former minister Padala Aruna joined Janasena party, Pawan Kalyan invited to the party by wearing a scarf

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)