Ali vs Pawan Kalyan: సీఎం జగన్ సై అంటే పవన్ కళ్యాణ్‌పై నేనే పోటీ చేస్తా, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వజైర్ అలీ కీలక వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వజైర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు.
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వజైర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు. మంత్రి రోజా, అలీ.. మంగళవారం నగరిలోని కొంటగట్టు సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.
ఈ క్రమంలో అలీ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశిస్తే పవన్‌పై పోటీకి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 175కి 175 సీట్లు గెలవడం ఖాయం. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు. సినిమా వేరు.. రాజకీయాలు వేరు అంటూ కామెంట్స్ చేశారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)