Andhra Pradesh Elections 2024: తాజా సర్వే.. ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం, అయితే ఎంపీ సీట్లు తగ్గే అవకాశముందని తెలిపిన ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే

జగన్ పార్టీ- చంద్రబాబు పార్టీ మధ్య పోటీ ఉండవచ్చని అంచనా వేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది.

YS Jagan Mohan Reddy (Photo-YSRCP)

India TV CNX Opinion Poll Survey: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. జగన్ పార్టీ- చంద్రబాబు పార్టీ మధ్య పోటీ ఉండవచ్చని అంచనా వేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. ఇక తెలంగాణ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చునని సర్వేలో తేలింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ జాతీయ పార్టీలు... రెండూ ఒక్క సీటూ గెలుచుకునే అవకాశాలు లేవని ఒపీనియన్ పోల్ విశ్లేషించింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచాయి. కానీ ఈసారి వైసీపీ 7 సీట్లు కోల్పోవచ్చునని... అవి టీడీపీ ఖాతాలో పడే అవకాశముందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. దక్షిణ భారతదేశంలో 132 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 38, ఇండియా కూటమి 60, ఇతరులు 32 గెలుచుకోవచ్చునని ఈ సర్వే అంచనా వేసింది. చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిశోర్ ఏమీ దేవుడు కాదు, కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Here's Poll Survey Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి