Pawan Kalyan Health Update: అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్, భీమవరం నేతల భేటీ అనారోగ్యం కారణంగా వాయిదా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అవిశ్రాంతంగా వారాహి యాత్ర కొనసాగిస్తుండటంతో స్వల్పంగా ఇబ్బంది పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Pawan Kalyan (Photo-Twitter)

వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉపవాస దీక్షలో ఉన్న పవన్ నీరసంగా ఉండడంతోనే అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత భేటీ జరిగే అవకాశం ఉంది. కాగా, పలు పార్టీలకు చెందిన నేతలు నేడు పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.

News

 

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement