Pawan Kalyan Health Update: వైరల్ ఫీవర్ నుంచి కోలుకుంటున్న పవన్ కళ్యాణ్, ఈ నెల 31న జనవాణికి అంతా రెడీ, ఉభయ గోదావరి జిల్లా పర్యటనలో వైరల్ ఫీవర్ బారిన పడిన జనసేనాధినేత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడిన విషయం విదితమే. ఆయన జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవలే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పర్యటనలోనే పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడిన విషయం విదితమే. ఆయన జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవలే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పర్యటనలోనే పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. పవన్‌తో పాటు ఈ పర్యటనలో పాలుపంచుకున్న పలువురు పార్టీ నేతలు, పవన్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా వైరల్ ఫీవర్ సోకిందని ఆయన వెల్లడించారు.
పవన్‌కు వైరల్ ఫీవర్ సోకిన కారణంగా ఈ నెల 24న (ఆదివారం) నిర్వహించనున్న జనవాణిని రద్దు చేస్తున్నట్లు నాదెండ్ల ప్రకటించారు. తదుపరి జనవాణిని ఈ నెల 31న నిర్వహిస్తామని, ఏ ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జనం సమస్యలను సేకరించి ప్రభుత్వానికి పంపేందుకు జనవాణి పేరిట జనసేన ఇటీవలే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో రెండు, భీమవరంలో ఓ జనవాణి కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)