Raghuveera Reddy: రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి బంధించిన మనవరాలు సమీరా, తనకు సమయాన్ని కేటాయించాలంటూ డిమాండ్, ఫేస్‌బుక్‌లో వెల్లడించిన మాజీ మంత్రి

మాజీ మంత్రి రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తన మనవరాలు సమైరా స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూపోస్ట్‌ రఘువీరా ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్‌ చేశారు.

Raghuveera Reddy (Photo-Facebook)

మాజీ మంత్రి రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తన మనవరాలు సమైరా స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూపోస్ట్‌ రఘువీరా ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్‌ చేశారు. తనకు సమయాన్ని కేటాయించడంలేదని అలిగిన ఆయన మనవరాలు సమైరా రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి కట్టి వేసిన దృశ్యంపై ఫేస్‌బుక్‌ యూజర్లు స్పందిస్తున్నారు.

తాళ్లతో కట్టేసి మరీ తనతో ఆడుకోమని డిమాండ్‌ చేయడం భలే వుంది. చాలా హృద్యంగా, కట్టిపడేసేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. డౌన్ టు ఎర్త్ అనేది రఘు వీరారెడ్డి సరిపోయే మాట అంటున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా సేవలు అందించి, విభజన అనంతపురం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement