PM Modi Srisailam Visit: వీడియో ఇదిగో, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, నేడు రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం మల్లిఖార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం మల్లిఖార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఇక్కడి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించనున్నారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీశైలం చేరుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
శ్రీశైలం దర్శన అనంతరం మోదీ మధ్యాహ్నం కర్నూలు శివారులోని నన్నూరు టోల్‌గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభలో ప్రధాని ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంపై ప్రసంగించనున్నారు. అనంతరం రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
PM Modi visits Srisailam in Kurnool